పోస్ట్‌లు

aarogyasri kirankumar reddy 108 104 corporate hospitals gandhi hospital usmania hospital hot news sensational news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పేద‌వాడి వైద్యం ఆగిపోయింది..!

చిత్రం
హైదరాబాద్ తో సహా పది జిల్లాలలో ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం, రేట్లు పెంచాలన్న డిమాండును పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ఈ పధకాన్ని తాము ఆమలు చేయలే మని కార్పొరేట్ ,ఇతర ఆరోగ్యశ్రీ స్కీము అమలు చేసే ఆస్పత్రులు ప్రకటించాయి.దీంతో వేలాది మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రుల కు వచ్చి కూడా తమను ఎవరు పట్టించుకోవడం లేదని వాపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంల ప్రతిష్టాత్మకంగా ఆరంభమైన ఈ స్కీముకు విశేష ఆదరణ లభించింది. పేదలు కూడా కార్పొరేట్ గుమ్మం ఎక్కగలుగుతున్నారు. అదే సమయంలో ఈ స్కీమ్ కార్పొరేట్ ఆస్పత్రులకు ఉపయోగపడుతోందని, ప్రభుత్వ ఆస్పత్రులు మూతపడుతున్నాయన్న విమర్శ కూడా ఉంది.దీనిని హేతుబద్దం చేయాలన్న డిమాండు కూడా వచ్చింది. కొన్ని వ్యాధులకు ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ విషయాలు ఎలా ఉన్నా, ముందుగా అమలు అవుతున్న స్కీమును ఆస్పత్రులు నిలిపివేయడంతో రోగులు ఇక్కట్లకు గురి అయ్యారు.ప్రభుత్వం దీనివల్ల మరింత ప్రతిష్ట కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.హైదరాబాద్, విశాఖ, గుంటూరు ,ఖమ్మం,కృష్...