భారత క్రికెట్ అభిమానులకి దీపావళి కానుక
భారతక్రికెట్ అభిమానులకి ఒక రోజు ముందుగానే దీపావళి వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వండేలనీ గెలిచి క్లీన్‌స్వీప్‌తో సిరీస్‌ని సొంతం చేసుకుంది. దీనితో ఇంగ్లండ్‌పై కసి తీర్చుకోవడమే కాకుండా కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులకి దీపావళి కానుకగా ఈ విజయాన్ని ధోని సేన సగర్వంగా సమర్పించింది.. ఊహించినట్టే ఇండియా ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ 176 పరుగులకే ఆల్ ఔట్ కావడంతో ఇండియాకు ఘనవిజయం లభించింది. 95 పరుగుల తేడాతో ఇండియా ఐదవ ఔన్ డే గెల్చుకుని సిరీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించింది. తొలుత ఇండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేయగా, ఇంగ్లండ్ అందుకు మొదట అద్భుతమైన సమాధానం చెప్పింది. 129 పరుగులవరకు ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా నష్ట పోకుండా బ్రహ్మాండంగా ఆడిందని క్రికెట్ విశ్లేషకులు ప్రశంసించారు. కుక్ 60 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఇంగ్లండ్ కష్టాలు ప్రారంభమయ్యాయి. మరి ఐదు పరుగులకు క్రేగ్‌ను జడేజా ఎల్.బి.డబ్ల్యు ద్వారా ఔట్ చేయడంతో కలకత్తాలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. అప్పటికి క్రేగ్ 64 బంతులలో 63 పరుగులు సాధిం...