పోస్ట్‌లు

nisha agarwal kagal agarwal arthi agarwal aditi agarwal tollywood movies kollywood movies tollywood movie reviews cinema news hot news hot gossips telugu cinem reviews లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అక్కలాగే చెల్లెలు కూడా…

చిత్రం
తెలుగు, త‌మిళంలో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొన‌స‌గాతున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలుగులో ఆమె న‌టించిన చిత్రాలు ఘ‌న‌విజ‌యాల‌ను సొంతం చేసుకున్నాయి. హీరోయిన్‌గా త‌న కెరీర్‌కి ప్ర‌స్తుతం ఎలాంటి ఢోకా లేక‌పోవ‌డంతో రంగంలోకి త‌న చెల్లెలిని కూడా దించింది. ఏమైంది ఈవేళ చిత్రం ద్వారా కాజ‌ల్ చెల్లెలు నిషా హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్‌గా నారా రోహిత్‌తో కలిసి ‘సోలో’లో నటిస్తోంది. ఇందులో నటిస్తూనే మరో వైపు తమిళ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది ఈ బాలీవుడ్ భామ. తన సోదరి కాజల్ అగర్వాల్‌లాగే తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో రాణించాలను కుంటుంది ఈ నిషాకళ్ల సుందరి. తన మూడో చిత్రంతోనే కోలీవుడ్‌లో నటించే ఛాన్స్‌ని దక్కించుకోవడం వల్ల… ఇక నుంచి రెండు భాషల్లోనూ నటించేందుకు మొగ్గు చూపుతున్నట్లు అర్థం అవుతోంది. నిషా అగర్వాల్ ఇటీవలే ఓ తమిళ చిత్రంలో నటించేందుకు సంతకం చేసిందని కోలీవుడ్ లో చెప్పుకుంటు న్నారు.. అన్నీ క‌లిస్తే ఈ ముద్దుగుమ్మ త‌న అక్క‌కే పోటీగా నిలిచినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు..