పీఆర్పీ, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహి
ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలో విలీనం అయితే ,ఎదుటివారు ఎంత చులకనగా చూస్తారనడానికి రాజమండ్రి ఘటన ఒక ఉదాహరణ.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన సంద ర్భంగా ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.ముఖ్యమంత్రి ఎదుటే పెనుగులాట చోటు చేసుకుంది. ఆ జిల్లాలో నలుగురుప్రజారాజ్యం ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఇద్దరు మంత్రి పదవులు ఆశి స్తున్నారు. అలాగే జిల్లా పార్టీ అద్యక్షపదవిని కూడా తమ వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు.కాని దానిపై కాంగ్రెస్ వర్గాలలో కాస్త గుర్రుగా ఉంది. కొత్తపేట కు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు రాజమండ్రిలో ప్రజా రాజ్యం కార్తకర్తల హడావుడి చూసి,పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలుంటేనే ఇంత హడావుడి చేస్తున్నారే అని వ్యంగ్యంగా అన్నారు. దానిపై ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి.ప్రజారాజ్యం మెమ్మెల్యేలు బండారు సత్యానందరావు, పంతం గాందీమోహన్ లు దానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సర్ది చెప్పడానికి యత్నించారు. ఏది ఏమైనా ప్రజా రాజ్యం కార్యకర్తలకు ఇలాంటి అనుభవాలు మరికొంతకాలం ...