ఇందిరమ్మా.. నీకు జోహార్లు..!!
కుమార్తెగా, భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తించే ఓ భారత స్త్రీ.. ఉక్కు మహిళగా, చరిత్ర సృష్టికర్తగా, దేశనేతగా ఎదిగిన పరిణామక్రమమిది. దేశ భవిష్యత్ కోసం అహర్నిశలూ పనిచేసిన ఆమే ఇందిరా గాంధీ. ఇవాళ ఆ మహా నాయకురాలి వర్థంతి సందర్బంగా ప్రత్యేక కథనం. మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్ ఉమెన్ ఎవరంటే.. ఠక్కున చెప్పే పేరు ఇందిరాగాంధీ. సొంతబాడీగార్డుల చేతిలో 1984, అక్టోబర్, 31న హతమై ఇరవయ్యారేళ్లు గడిచాయి. ఆమె జీవితం ఆద్యంతం ఓ సాహసోపేతమైన గాథ. ఉక్కుమహిళగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఇందిర జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తెగా రాజకీయాల్లోకి అడుగెపెట్టినా.. తదనంతర చరిత్రకు తానే సృష్టికర్త అయ్యారు. సస్య విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, బంగ్లాదేశ్ పరిరక్షణ, పోఖ్రాన్ అణు పరీక్ష, గరీబ్ హఠావో, ఎమర్జెన్సీ.. ఇలా ఇందిరా తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయం.. ఓ చరిత్రాత్మక ఘట్టమే! నేడు ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న ఆర్థికమాంద్యాన్ని భారతదేశం తట్టుకొని నిలబడిందంటే.. నాడు బ్యాంకులను జాతీయకరణ చేసిన ఇందిరగాంధీ ముందుచూపే. బంగ్లాద...