అజాద్ కేంద్రమంత్రి కాబోతున్నారా..?
కేంద్రంలో హోం మంత్రి బాద్యతలనుంచి చిదంబరం ను తప్పిస్తారా? కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అనేక మార్పులు,చేర్పులు చోటు చేసుకుంటాయని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.ప్రత్యేకించి హోం మంత్రి చిదంబరం ను ఆ శాఖ నుంచి తప్పించవచ్చని, కొత్త హోం శాఖ మంత్రిగా గులాం నబీ అజాద్ ను నియమించవచ్చని కదనాలు వస్తున్నాయి. అయితే మరో కధనం ప్రకారం కీలకమైన వ్యక్తుల శాఖలె వ్వరీ మారబోవని చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రిగాఅజాద్ ను నియమించడంలో ఒక ప్రత్యేకత ఉందని, ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఇలాంటి సమయంలో ఆయనకు హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తే మరింత ప్రయోజనం ఉంటుందన్నది కొందరి వాదన. అలాగే కాశ్మీర్ లో ఉగ్రవాద సమస్య ఇటీవలికాలంలో తగ్గుముఖం పట్టడం కూడా కాస్త ఆశాజనక వాతావరణంగా ఉంది. దానిని మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి అజాద్ ఉపయోగపడవచ్చు. చత్తీస్ గడ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో ఉన్న నక్సల్స్ సమస్య తీవ్రతను తగ్గించడానికి కూడా అజాద్ సేవలను వాడుకోవాలన్నది పార్టీ ఉద్దేశంగా చెబుతున్నారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటి...