పోస్ట్‌లు

yerram naidu tdp congress trs telangana samaikhyandhra jai telangana political news political articls hot news hot gossips kadapa bandh tdp లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఇక అటువైపు బంద్ లు షురూ..!

చిత్రం
సమైక్య రాష్ట్ర ఉద్యమం పేరుతో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుంది. సీమాంధ్ర టిడిపి నేతలు గుంటూరులో సమావేశమై సమైక్యాంధ్రకోసం ఉద్యమం చేస్తా మని హెచ్చరిస్తే,కడప జిల్లాలో సమైక్యాంధ్ర జెఎసి పేరుతో ఏకం గా బంద్ నే నిర్వహించారు. సమైక్య రాష్ట్రం కోరుతూ కడప జిల్లాలో బంద్ విజయవంతంగా జరుగుతోంది. ఒక పెట్రోల్ బంక్ పై తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేసి అద్దాల పగులకొట్టారు. పేరుకు జెఎసి అన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ హడావుడినే ఎక్కువగా కనిపించింది. కడప జిల్లాలో కొద్దికాలం క్రితం జరిగిన ఉప ఎన్నికలో ఘోరంగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ మళ్లీ కాస్త పుంజుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు కనిపించింది. సమైక్య రాష్ట్రం కోసం తాము ప్రాణాలైనా ఇస్తామని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు.