పోస్ట్‌లు

telugu bhasha antarjaalam lo telugu telugu bhasha dinotsavam telugu unicode font telugu language international telugu unicode fonts లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

దేశంలోనే మొద‌టిసారిగా తెలుగుకు యూనికోడ్ స‌భ్యత్వం

చిత్రం
తెలుగుభాష‌ని విశ్వ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు రావ‌డానికి కృషి చేస్తున్న తెలుగు భాషాభిమానుల‌కు శుభ‌వార్త.. సిలికా నాంధ్ర వ్యవ‌స్థాప‌క అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం స‌మ‌కారంతో మ‌న తెలుగు భాష‌కు అంత‌ర్జా లంలో పూర్తి స్థాయి స‌భ్యత్వం పెంపొందించారు. యూనికోడ్ కన్సార్షియంలో తెలుగు పూర్తిస్థాయి అధికారిక సభ్యత్వం పొందిం దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. ఈ ఘనత పొందిన తొలి భారతీయ భాష తెలుగేనని ఆయన సగ ర్వంగా ప్రకటించారు. హిందీ, తమిళ భాషలకు వ్యవస్థాగత సభ్యత్వం మాత్రమే ఉందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం యూనీకోడ్ కన్సార్షియంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, ఐబీఎమ్, అడోబ్ సిస్టమ్స్ తదితర దిగ్గజాల సరసన పదో సభ్యురా లిగా చేరిందని తెలిపారు. సభ్యత్వం కోసం కన్సార్షియానికి రాష్ట్ర సర్కారు రూ.7లక్షల రుసు ము చెల్లించిందని, స్వాతంత్య్రం వచ్చాక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా ఖర్చుపెట్టడం ఇదే మొదటి సారి అని ఆయన అన్నారు.