పోస్ట్‌లు

tdp chandrababu naidu akbaruddin ovaysi asaduddin ovaisi mim party political news plitical articls ys jagan mohan reddy shobha nagireddy లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఉప ఎన్నిక‌ల‌కు మేము సిద్దం : జ‌గ‌న్‌

చిత్రం
అసెంబ్లీలో సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘటన అని వైఎస్ఆర్ పార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో తొలి సారిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదవులు పోతాయని తెలిసినా ప్రజల పక్షాన నిలబడిన తన ఎమ్మెల్యేలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో అవిశ్వాసానికి మద్దతు తెలిపామని ఆయన పేర్కొన్నారు. అసలు అసెంబ్లీలో చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా పెట్టారా లేక రైతు సమస్యలపై పెట్టారా అని అనుమానం వచ్చిందని జగన్ అన్నారు. దివంగత నేతను తిట్టేందుకే చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించారని, తమ ఎమ్మెల్యేలను చంద్రబాబు రెచ్చగొట్టారని విమర్శించారు. చంద్రబాబువి కుళ్లు, కుతంత్రంతో కూడిన రాజకీయం అని జగన్ ఆరోపించారు. మరోవైపు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రలోభాలకు పాల్పడిందని, బెదిరింపులకు దిగిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ దొందూ దొందే అని, రైతు సమస్యలపై ఇద్దరికీ తెలియదని జగన్ అన్నారు. ధైర్యముంటే అందరిపైనే ఒకే సారి అనర్హత వేటు వేయండని సవాల్ ...