పోస్ట్‌లు

sakshi sakshi media jagan jailukelite special article ap political article hot toppic hot news hot articls political news political articls ys Rajashekar reddy ambati rambabu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వైఎస్ఆర్ ఆత్మపై దాడి..

చిత్రం
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆత్మమీద కాంగ్రెస్ పార్టీ సిబిఐ తో దాడి చేసిందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికార ప్రతినిది అంబటి రాంబాబు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాందీ, కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి నేతలు కుమ్మక్కై ఈ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితి తర్వాత ఇందిరాగాందీని వేధించడానికి ఆనాటి ప్రభుత్వం ఎలా చేసిందో, అలాగే ఇప్పుడు జగన్ పై వేధింపులు జరుగుతున్నాయని, ఆమె మాదిరే జగన్ అధికారంలోకి భారీ ఆధిక్యతతో వస్తారని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డికి ప్రీతిపాత్రమైన సాక్షిపైన దాడిచేసి, రాజశేఖరరెడ్డిని అవినీతిపరుడుగా చిత్రీకరించడానికి ఇంత కుట్ర జరుగుతోందని జనం బాధపడుతున్నారని అన్నారు. ఐదులక్షల నలభై వేల మెజార్టీతో జగన్ ను గెలిపిస్తే, ఇప్పుడు ఇలా చేస్తారా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ఇలా చేసేవారా అని జనం ప్రశ్నిస్తున్నారని అన్నారు. జగన్ కాంగ్రెస్ లోకి వస్తే పునీతుడవుతాడని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఎట్టి పరిస్థితులలోను జగన్ కాంగ్రెస్ లో చేరే ప్రసక్తి లేదని రాంబాబు స్పష్టం చేశారు.