ఎమ్మెల్యే విష్ణు తెలంగాణ మద్దతు వెనుక..?
హైదరాబాద్ నగరంలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. జూబ్లి హిల్స్ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధనరెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ తో మున్ముందు రాజకీయంగా ఘర్షణ పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విష్ణు పార్టీ పరంగా ఎవరూ వంటా, వార్పు కార్యక్రమంలో పాల్గొననప్పికీ ఆయన స్వయంగా పాల్గొని తెలంగాణ కు మద్దతు ఇచ్చారు. అవసరమైతే తెలంగాణ సాధనకోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు.పార్టీలకు అతీతంగా తెలంగాణ సాధనకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. తన తండ్రి కూడా తెలంగాణ సాధనకు కృషి చేశారని చెప్పారు. కాగా మంత్రి దానం నాగేందర్ వంటవార్పు వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రజలు ప్రశాంత జీవనాన్ని కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒత్తిడి రాజకీయాలు చేయడం వల్ల కూడా ఉపయోగం ఉండదని నాగేందర్ పేర్కొనడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదట నుంచి నాగేందర్, మరో మంత్రి ముకేష్ వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ తెలంగాణ ఇచ్చేటట్లయితే హైదరాబాద్ ప్రత్యేకంగా రాష్ట్రం గా ఉండాలని వారు డిమాండు చేశారు. ఆ తర్వాత ఒ...