పోస్ట్‌లు

anna hazare kiranbedi kezrival lokpal bill loksatta fight again curruption hot news hot articls special news special articls manmohan singh soniagandhi janlokpal bill againest for curroption లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కోలుకున్న హ‌జారే..!

చిత్రం
సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. శ్వాస సంబంధిత వ్యాధితోపాటు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న హజారేని రాలేగావ్ సిద్ధి నుండి తరలించి, డిసెంబర్ 31 తేదిన పూణేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఎక్స్‌రే, బ్లడ్ టెస్ట్ రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. పూర్తి విశ్రాంతి అవసరమైనందున, సందర్శకులను ఎవరిని అనుమతించడం లేదని.. ఆదివారం నాడు హజారేను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. పటిష్ట లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాలంటూ ముంబైలో డిసెంబర్27 తేదిన చేపట్టిన దీక్ష సందర్భంగా హజారే అస్వస్థతకు గురయ్యారు.

కోర‌లు లేని లోక్‌పాల్ బిల్లు

చిత్రం
» జ‌ర్నిలిస్టుల నిర‌స‌న‌లు.. » లొల్లి రాష్ట్రప‌తి ద‌గ్గర‌కు వెళ్తుందా..? » కంగారూల చేతిలో కుదేల‌య్యారు.. » ‘థానే’ తో తీరాలు అల్లక‌ల్లోలం.. » ఉనికి కోసం బాబు పాట్లు » గాలికి మ‌ళ్లీ చుక్కెదురే..! » వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అత‌నే ‘కిర‌ణం’ » 2011.. హిట్సూ.. ఫ్లాప్స్‌.. » ఉత్తర కోస్తాకు పెను తుఫాను » సిఎం ఢిల్లీ టూర్ వెనుక‌.. కోర‌లు లేని లోక్‌పాల్ బిల్లు రాజ్యాంగ హోదా కల్పించకుండా లోక్ పాల్ బిల్లును ఆమోదించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇది కోరలు లేని లోక్ పాల్ బిల్లు అని విపక్షాలు, సామాజిక బృందం నేత అన్నా హజారే తీవ్రంగా వ్యాఖ్యాని స్తుండగా, లోక్ సభే సుప్రిం గా ఉండాలని పార్లమెంటు సభ్యులు పలువురు అభిప్రాయ పడుతున్నారు.ఈ బిల్లుకు ఓటింగ్ జరిగిన సమయంలో ఇరవై ఐదు మంది యుపిఎ సభ్యులు కూడా సభలో లేకపోవడం విశేషం.కాగా సమాజవాది పార్టీ, బి.ఎస్.పి, లెఫ్ట్ పార్టీలు వాకౌట్ చేశాయి.అయితే...

అన్నా దీక్షకి ఫీవ‌ర్ అడ్డమా..?

చిత్రం
ప‌టిష్ఠమైన లోక్‌పాల్ బిల్లుకోసం అన్నా హ‌జారే దీక్ష చేయ‌డానికి పూనుకున్నారు. అయితే.. గ‌త కొద్ది రోజులుగా అన్నా ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే.. త‌న అనారోగ్యాన్ని కూడా లెక్కచేయ‌కుండా  అన్నా హజారే మూడు రోజుల దీక్షను మంగళవారం ముంబైలో ప్రారంభించనున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేలవమైన లోక్‌పాల్ బిల్లుకు నిరసనగా హజారే మూడు రోజుల దీక్షను చేపట్టనున్నారు. దీక్ష కోసం సోమవారం రాత్రి రాలేగావ్‌సిద్ధి నుంచి ముంబైకి చేరుకున్నారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షను చేపట్టేందుకే మొగ్గు చూపారు. బాంద్రా సబర్బన్ నుంచి ర్యాలీ నిర్వహించి, ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. జుహూలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి ముందుకు సాగనున్నారు. హజారే ర్యాలీ శాంతాక్రజ్, తులిప్ స్టార్ హోటల్, మితిబాయి కాలేజి, ఎస్‌వీ రోడ్, విలే పర్లే, ఖర్, బంద్రా హైవేలలో నిర్వహించనున్నారు.

ప్రభుత్వాలు పడగొట్టే బిల్లు ! (పార్ట్ 4)

చిత్రం
లోక్ పాల్ బిల్లును అవినీతిని అంతమొం దించే ఏకైక అస్త్రంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అప్పట్లో అనుకుంది. బిల్లు చకచకా పార్లమెంట్ గడపతొక్కింది. కానీ మళ్లీ అంతలో రాజకీయసంక్షోభం. అంతే, బిల్లు మరోసారి అటకెక్కేసింది. యూపీఏ పాలనలో కూడా బిల్లు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏదో కలత….మరేదో అలజడి… పాలకులకు నిద్రపట్టడంలేదు. సంకీర్ణ ప్రభుత్వాలు  నడుస్తున్న రోజులవి. 1998లో బీజేపీ నేతృత్వంలోని  సంకీర్ణ కూటమి – NDA గద్దెనెక్కింది. గతంలో జనాతాపార్టీ అవినీతిపై నడిపిన మహోద్యమంలో భాగస్వాములైన రాజకీయ పక్షాలే ఎన్డీయేలో కూడా ఉండటంతో ఈ కూటమి అధికారంలోకి రాగానే మరోసారి లోక్ పాల్ బిల్లు ప్రస్తావన వచ్చింది. దీంతో బిల్లు నేరుగా  మరోసారి పార్లమెంట్ గడపతొక్కింది. ఇక బిల్లుకు చట్టబద్ధత రావడమే తర్వాయి అనుకుంటున్నవేళలో అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత, వాజ్ పేయ్ ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకోవడంతో కథ మళ్ళీ మొదటికివచ్చింది. ఎన్డీయే 2001లో మరోసారి ఎన్డీయే అధికారం చేపట్టినప్పుడు కూడా పట్టువదలని వి...

ప్రభుత్వాలు పడగొట్టే బిల్లు! (పార్ట్ 3)

చిత్రం
వీపీ సింగ్ హయాంలోనూ, దేవెగౌడ పాలనలోనూ సీను మారలేదు. లోక్ పాల్ బిల్లు ముట్టుకోగానే రాజకీయ సంక్షోభంతో పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. బిల్లూకీ, సంక్షోభాలకీ ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, లోక్ పాల్ బిల్లు అనగానే ఢీల్లీ పెద్దల్లో వణుకు పుట్టుకొస్తూనే ఉంది. కేంద్రంలో పాలన విషయానికి వస్తే, 1989కి ఓ ప్రత్యేకత ఉంది. ఆ సంవత్సరమే కేంద్రంలో  రెండోసారి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బోఫోర్స్ కుంభకోణంపై ఎదురొడ్డిపోరాడిన వీపీ సింగ్ , నేషనల్ ఫ్రంట్ తరఫున ప్రధాని అయ్యారు. ప్రధాని కాగానే ఆయన చూపు లోక్ పాల్ బిల్లుపైనే పడింది. అవినీతిని ఎండగొట్టే సాధనంగా ఈ బిల్లు పనిచేస్తుందని వీపీ సింగ్ నమ్మేవారు. ఆయన చూపిన చొరవతో బిల్లు ఐదోసారి పార్లమెంట్ లోకి ప్రవేశించింది. లోక్ పాల్ యంత్రాంగం కోసం భారీ బడ్జెట్ కేటాయించాలని కూడా అనుకున్నారు. ఇక బిల్లుకు చట్టబద్ధత రావడమే తరువాయన్న సమయంలో రాజకీయ సంక్షోభం వచ్చేసింది. సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో  వీపీ స...

ప్రభుత్వాలు పడగొట్టే బిల్లు ! (పార్ట్ 2)

చిత్రం
1977లో దేశంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడినప్పుడు లోక్ పాల్ బిల్లు చురుగ్గానే కదిలింది. కానీ స్థాయీ సంఘం నివేదిక ఇచ్చేలోపే జనతా ప్రభుత్వం కూలిపో యింది. ఇందిరాగాంధీ పాలనకు  వ్యతిరేకత పెల్లుబికిన రోజులవి. జనతాపార్టీ  తిరుగుబాటు  బావుటా ఎగరేసిన రోజులవి. ఈ ప్రభంజనానికి కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది. 1977లో దేశచరిత్రలోనే తొలిసారిగా  కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సమయంలోనే అవినీతిని అంతంచేయాలన్న దృఢసంకల్పంతో  లోక్ పాల్ బిల్లును వెలికితీశారు. పార్లమెంట్ లో బిల్లుపై చర్చ జరిగింది. ఇప్పటిలాగానే అప్పట్లో కూడా స్థాయీసంఘానికి పంపించారు. ఈ సంఘం తన నివేదికను ఇవ్వడానికి ముందే జనతా ప్రభుత్వం కూలిపోయింది. లోక్ పాల్ బిల్లు ముట్టుకోగానే   రాజకీయ సంక్షోభం రావడం ఇది మూడోసారి.   మరి దీన్ని ఎలా అనుకోవాలి? కాకతాళీయంగానే భావించాలా…లేక ఇంకేదైనా అతీతమైన కారణం దాగుందా? ఇందిరాగాంధీ హత్యానంతరం ఆమె కుమారుడైన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్...

ప్రభుత్వాలు పడగొట్టే బిల్లు ! (పార్ట్ 1)

చిత్రం
ఢిల్లీ పాలకులు పార్లమెంట్ లో ఎన్నో బిల్లులు ప్రవేశపెట్టి ఉండవచ్చు. బిల్లు ప్రయోజనాల గురించి గంటలకొద్దీ చట్టసభల్లో మాట్లాడుతుండవచ్చు. కానీ ఒక బిల్లు పేరు చెబితే మాత్రం భయపడిపోతున్నారు. ఆ బిల్లు పేరెత్తగానే ముచ్చెమటలు పోస్తున్నాయి. ఇంతకీ ఆ బిల్లు మరేదోకాదు, దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్ పాల్ బిల్లు. ఏ బిల్లు పేరుచెబితే అవినీతిపరులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయో, ఆ బిల్లే చాలా చిత్రంగా పాలకుల్ని సైతం భయపెడుతోంది. కాకతాళీయమో, లేక అతీతమైన కారణాలేమైనా ఉన్నాయో తెలియదుకానీ, లోక్ పాల్ బిల్లు పార్లమెంట్ గడపతొక్కినప్పుడల్లా రాజకీయ సంక్షోభం ఎదురవుతూనే ఉంది. చాలా సందర్భాల్లో బిల్లు ఇలా చర్చకు రాగానే, అలా ప్రభుత్వాలు పడిపోయాయి. అన్నా హజారే దీక్షలతోనో, లేదంటే, ప్రస్తుతం ఊపెక్కిన అవినీతి వ్యతిరేక ఉద్యమాలతోనో లోక్ పాల్ బిల్లు ఉన్నట్టుండి తెరమీదకు రాలేదు. ఈ బిల్లుకు 40ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇప్పటి వరకు 9సార్లు బిల్లు పార్లమెంట్ గడపతొక్కింది. అయితే అలా జరిగిన ప్ర...