రెచ్చగొడుతుంది కేసీఆరే..!
తెలంగాణ ప్రజలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆరే రెచ్చగొడుతున్నారని, ఆయన మాటల ద్వారానే యువత, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లగడపాటి రాజగోపాల్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రజల జీవితాలు మారిపోతాయని అక్కడి ప్రజల్లో భ్రమలు కలిగిస్తున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం కెసిఅర్ విషం తాగి చస్తానని అనడం యువతను, విద్యార్థులను ఉద్వేగానికి, ఉద్రేకానికి గురి చేస్తుందని అన్నారు. నాయకులు పోరాటం చేయాలే కానీ చస్తానని అనడం సరికాదన్నారు. హరీష్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారనే శ్రీకాంతచారి మృతి చెందినట్లుగా కనిపిస్తోందని అన్నారు. తాను తెలంగాణ వద్దని ఎప్పుడూ అనలేదని, శాస్త్రీయ పద్ధతి అని మాత్రమే చెప్పానని అన్నారు. సీమాంధ్ర ప్రాంతం నుండి వెళ్లిన కెసిఆర్, విజయశాంతి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం విశేషం అన్నారు. రెచ్చగొడితే నాయకులకు పదవులు వస్తాయి. కానీ అమాయ ప్రజలు మృతి చెందుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల రెచ్చగొట్టే మాటలు విని యువత ఆత్మహత్యలకి పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగు వారిని విడదీసి రాజకీయంగా ఎదగాలన...