పోస్ట్‌లు

vallabhaneni ashok c. kalyan singanamala ramesh real estate danda tollywood movie news movie reviews movie hot news movie articls లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

క‌బ్జా కేసులో సినీ నిర్మాత అరెస్టు..

చిత్రం
తెలుగు సినిమా ప‌రిశ్రమ‌లో నిర్మాత‌లుగా మంచి పేరు సంపాదించిన కొంద‌రు నిజ జీవితంలో మాత్రం విల‌న్లుగా పేరు సంపాదిస్తున్నారు. మాఫియాతో దోస్తీ చేయ‌డం, భూ కుంభ‌కోణాల‌లో ఇరుక్కోవ‌డం, రియ‌ల్ ఎస్టేట్ పేరుతో ప్రజ‌ల‌ను మోస‌గించ‌డం లాంటివి త‌ర‌చూ వెలుగు చూస్తున్నాయి. గ‌తంలో ఇలాంటి కేసుల‌లోనే నిర్మాత‌లు సింగ‌ణ‌మ‌ల ర‌మేష్‌, సి. క‌ళ్యాణ్‌లు ఇరుక్కోగా తాజాగా వారికి జ‌త‌గా మ‌రో నిర్మాత చేరిపోయాడు. ఎల్లారెడ్డిగూడలో ఓ భూకబ్జా కేసుకు సంబంధించి సినీ నిర్మాత వల్లభనేని అశోక్ సహా 11మందిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారిని సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సినిమా ప‌రిశ్రమ‌లో నిల‌దొక్కుకోవ‌డానికి, భారీ సినిమాలు తీసి మెగా ప్రొడ్యూస‌ర్ అనే పేరు సంపాదించుకోవ‌డానికి కొంద‌రు నిర్మాత‌లు ఇలా అక్రమ ప‌ద్దతుల‌లో డ‌బ్బులు కూడ‌బెట్టుకోవ‌డానికి ప్రయ‌త్నించ‌డం విచార‌క‌రం..