చురకత్తిలో తండ్రితో జూ.ఎన్టీఆర్
తండ్రీ కొడుకులు ఒకే సినిమాలో నటించడం కొత్తేమీకాదు. అయితే నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కలసి మొట్టమొదటిసారిగా ఓ సినిమాలో నటించబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు తాత్కాలికంగా `చురకత్తి’ అని పేరుపెట్టారు. బోయపాటి శీను గతంలో బాలకృష్ణతో సింహ సినిమా తీశారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన భార్య ప్రణతితో హనీమూన్ లో ఉన్నాడు. సినీ ఫీల్డ్ లో ఒక పక్క అల్లు అర్జున్, రాం చరణ్ తేజ కాంబినేషన్ లో ఒక మువీ రాబోతుందన్న వార్తతో నందమూరి కుటుంబంలో హీట్ పుట్టినట్టుందని సినీవర్గాలు అంటున్నాయి. - మువీ ప్రతినిధి (హైదరాబాద్)