పాస్టింగ్ వల్ల సినిమా వదులుకున్నా..
అని అంటోంది అందాల ముద్దు గుమ్మ కల్యాణ్‌రామ్ కత్తి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సనాఖాన్. రంజాన్ మాసం అంటే సనాకి ఎంతో భక్తి. రంజాన్ మాసంలో పవిత్రంగా ఉంటుందిట. అంతేకాదు ఆ మాసం మొత్తం ఉపవాస దీక్ష కూడా చేస్తుందిట. ఈ మాసం మొత్తం పబ్బులకి, పార్టీలకి, సినిమా షూటింగులకి దూరంగా ఉంటాను. కేవలం దైవ భక్తిలో ఉపవాస దీక్ష చేసుకుంటాను. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం అంటే నాకెంతో ఇష్టం. కాలేజీ రోజుల నుండి ఉపవాసం ఉండటం అలవాటు చేసుకున్నానని అంటోంది ఈ అమ్మడు. అంతేకాదు.. పోయినేడు ఇదే సమయంలో తనకి మంచి తమిళ సినిమా ఆఫర్ వస్తే.. రంజాన్ ఉపవాస దీక్ష కారణంగా ఆ సినిమానే వదులుకుందిట. కేవలం పాస్టింగ్ వల్లనే ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని, ఆ సినిమా రిలీజయి ఘనవిజయం సాధించిందని చెప్పుకొచ్చింది. ఏది ఏమయినప్పటికీ హీరోయిన్‌గా ఉంటూ కూడా తనలోని ఆధ్యాత్మిక చింతనని మరువకుండా పవిత్రంగా ఉండాలని సనాఖాన్ భావించడం ఏంతైనా అభినందనీయం. ఈ ఫాస్ట్ కల్చర్‌లో ముఖ్యంగా సినిమా ఫీల్డులో ఉన్న తారలు సనాని చూసి తాము కూడా మారాలి.