పోస్ట్‌లు

soniagandhi undavalli arunkumar ys jaganmohan reddy ys rajashekar reddy political news political articls political gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సోనియా మాకు దేవత

చిత్రం
“సోనియా మాకు దేవత, వైఎస్ పూజారి. నేను భక్తుడ్ని. పూజారి చనిపోతే ఆయన కుమారుడితో ఉండాలని ఎక్కడా లేదు. దేవతను వదల్లేం కదా” అని  రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అన్నారు .  తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు, తాజా రాజకీయాలపై  వార్షిక నివేదిక ప్రకటిస్తూ అయన  మాట్లాడారు.. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించిన ఆస్తులనే ఆయన భార్య విజయమ్మ కూడా పులివెందుల ఉప ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని  దీనిని బట్టి వైఎస్ ఆస్తులు పెరగలేదన్నారు. ఇదే సమయంలో జగన్ ఆస్తులు మాత్రం పెరిగాయన్నారు. భారతి సిమెంట్స్‌లో వాటాలు విదేశీ కంపెనీకి విక్రయించడం వల్ల జగన్ ముందస్తుగా రూ.86 కోట్ల పన్ను చెల్లించారని ఉండవల్లి పేర్కొన్నారు. వైఎస్‌తో సాన్నిహిత్యం ఉన్న తనపై ఊసరవెల్లి.. నమ్మకద్రోహి.. అంటూ సాక్షి లో ఇష్టానుసారం కథనాలు రాసారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ మరణం  తర్వాత రాజీవ్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు జనం తండోపతండాలుగా వచ్చారని.. అయితే వారంతా ఆయన్ను చూడ్డానికి వచ్చారే తప్ప ఓట్లు వేయడానికి...