పోస్ట్‌లు

rajanikanth chandramukhi manichitrataju aptamitra chennai news tollywood movies tamil movies robo chennai news rajini struckup rajani sick లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రాణా షూటింగ్‌లో ర‌జ‌నీ..

చిత్రం
రజనీకాంత్ రానా సినిమాలో నటిస్తారని ఆయన అల్లుడు ధనుష్ ప్రకటించారు. సింగపూర్ లో విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్ ను పరామర్శించి వచ్చిన ధనుష్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం బాగా ఉందని, రజనీ పై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమా రానా ను పూర్తి చేయాలనుకుంటున్నారని ప్రకటించారు. ఆ తరువాత సినిమాలు చేయాలా వద్దా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధనుష్ ప్రకటించారు.

ఐసీయులో రజనీకాంత్… ప‌రిస్థితి విషమించిందా?

చిత్రం
ర‌జినీకాంత్ ప‌రిస్థితి విష‌మించిందా…? ఆయ‌న శ‌రీరం చికిత్స‌కి స‌హ‌క‌రించ‌డంలేదా…? ఆయ‌నని అత్య‌వ‌స‌ర చికిత్సా విభాగంలో అడ్మిట్ చేయ‌డాన్ని బ‌ట్టి ఈ ప్ర‌శ్న‌లు నిజ‌మేన‌నిపిస్తున్నాయి. ర‌జ‌నీకాంత్ గ‌త నెల రోజుల నుండి త‌ర‌చూ అనారోగ్యం కార‌ణంగా చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆయ‌న చెన్నైలోని ఓ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయ‌న క‌డుపునొప్పి కార‌ణంగా చికిత్స తీసుకుంటున్నార‌ని, ఆయ‌న ఆరోగ్యం త్వ‌ర‌లోనే కోలుకుంటుంద‌ని ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, డాక్ట‌ర్లు చెబుతూ వ‌చ్చారు.. కానీ.. తాజాగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసియు లోకి మార్చార‌ని, ఆయ‌న ఒక కిడ్నీ ప‌నిచేయ‌డంలేద‌ని, అలాగే జీర్ణాశ‌యం కూడా స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని తెలుస్తోంది.. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం విష‌మించింద‌ని.. ఆయ‌న‌కి అత్యుత్త‌మ చికిత్స‌ని అందిస్తున్నామ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ర‌జనీకాంత్ ఆరోగ్యం విషమించింద‌నే వార్త బ‌య‌టికి పొక్క‌డంతో ఆయ‌న అభిమానుల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న త్వ‌ర‌లోనే కోలుకుంటార‌ని, ఆయ‌న ఆరోగ్యం కుదుట ప‌డ్డాక పూర్తిగా రెస్ట్ ...

ర‌జ‌నీ ఇంకా కోలుకోలేదు…

చిత్రం
రోబో చిత్రంలో మ‌ర‌మ‌నిషిగా న‌టించిన మెప్పించిన ర‌జ‌నీకాంత్‌.. ఇప్పుడు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయ‌న‌ని తాజాగా చెన్నైలోని రామ‌చంద్రన్ హాస్పిట‌ల్‌లో చికిత్స పోందుతున్నారు. దీంతో ర‌జ‌నీ ఆరోగ్యం విశమించింద‌ని.. ఆయ‌న అప‌స్మార‌క స్థితిలో ఉన్నాడ‌న్న పుకార్లు త‌మిళ‌నాడులో షికార్లు చేసాయి. ఈ వార్త విన్న అభిమానులు షాకైపోయి ర‌జ‌నీ చికిత్స తీసుకుంటున్న హాస్పిట‌ల్‌కి చేరుకున్నారు.. ర‌జ‌నీని చూపించాల‌ని ఆందోళ‌న చేప‌ట్టారు. చివ‌రికి ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ వ‌చ్చి అభిమానుల‌కి న‌చ్చచెప్పాల్సివ‌చ్చింది. ఇంత‌కీ ర‌జ‌నీకి వ‌చ్చిన వ్యాధి ఏమిటి..? ఆయ‌న నిమ్మోనియా అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడ‌ని.. ఆయ‌న త‌న స్టైల్లో యోగా, అర్బర్ మెడిసిన్‌ని వాడినా ప్రయోజ‌నం లేక‌పోవ‌డం, ఆయుర్వేదం, అల్లోప‌తి లాంటి వైద్యసేవ‌లు కూడా తీసుకోవ‌డం.. త‌న ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ద చూపించ‌క‌పోవ‌డంతో ఇప్పుడీ ప‌రిస్థితి ఏర్పడింద‌ని వైద్యులు అంటున్నారు. మ‌రింత మెరుగైన వైద్యం గురించి ఆయ‌న్ని విదేశాల‌కి తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నారు. కానీ.. ఆయ...