ర‌జ‌నీ ఇంకా కోలుకోలేదు…


రోబో చిత్రంలో మ‌ర‌మ‌నిషిగా న‌టించిన మెప్పించిన ర‌జ‌నీకాంత్‌.. ఇప్పుడు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయ‌న‌ని తాజాగా చెన్నైలోని రామ‌చంద్రన్ హాస్పిట‌ల్‌లో చికిత్స పోందుతున్నారు. దీంతో ర‌జ‌నీ ఆరోగ్యం విశమించింద‌ని.. ఆయ‌న అప‌స్మార‌క స్థితిలో ఉన్నాడ‌న్న పుకార్లు త‌మిళ‌నాడులో షికార్లు చేసాయి. ఈ వార్త విన్న అభిమానులు షాకైపోయి ర‌జ‌నీ చికిత్స తీసుకుంటున్న హాస్పిట‌ల్‌కి చేరుకున్నారు.. ర‌జ‌నీని చూపించాల‌ని ఆందోళ‌న చేప‌ట్టారు. చివ‌రికి ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ వ‌చ్చి అభిమానుల‌కి న‌చ్చచెప్పాల్సివ‌చ్చింది. ఇంత‌కీ ర‌జ‌నీకి వ‌చ్చిన వ్యాధి ఏమిటి..? ఆయ‌న నిమ్మోనియా అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడ‌ని.. ఆయ‌న త‌న స్టైల్లో యోగా, అర్బర్ మెడిసిన్‌ని వాడినా ప్రయోజ‌నం లేక‌పోవ‌డం, ఆయుర్వేదం, అల్లోప‌తి లాంటి వైద్యసేవ‌లు కూడా తీసుకోవ‌డం.. త‌న ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ద చూపించ‌క‌పోవ‌డంతో ఇప్పుడీ ప‌రిస్థితి ఏర్పడింద‌ని వైద్యులు అంటున్నారు. మ‌రింత మెరుగైన వైద్యం గురించి ఆయ‌న్ని విదేశాల‌కి తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నారు. కానీ.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు మాత్రం ర‌జ‌నీ ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంద‌ని, త్వర‌లోనే కోలుకుంటాడ‌ని అంటున్నారు. ర‌జ‌నీని ప‌రామ‌ర్శించ‌డానికి నారా చంద్రబాబు నాయుడు, గుజ‌రాత్ ముఖ్యమంత్రి న‌రేంద్రమోడీ హాస్పిట‌ల్‌కి వ‌చ్చారు. ర‌జ‌నీని ప‌రామ‌ర్శించాక వారు కూడా ర‌జ‌నీ బాగానే ఉంటున్నాడ‌ని అంటున్నారు.. ఏది ఏమ‌యిన‌ప్పటికీ ర‌జినీ త్వర‌గా కోలుకోవాల‌ని కోరుకుందాం
న్యూస్ ఫ్రం చెన్నై

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

జపాన్ రేడియేషన్ ఇండియాకు వచ్చేస్తోందా?