ఛార్జీల పెంపుతో కాంగ్రెస్‌లో గుబులు
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తోంది. ఉప ఎన్నికలకు ముందు ఈ ప్రతిపాదన రావడం, దానికి విస్తృతంగా ప్రచారం రావడం,ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థిరపడుతున్నారని భావిస్తున్న తరుణంలో విద్యుత్ ఛార్జీల ప్రబావం ఎలా ఉంటుందోనన్న ఆందోళనను ముఖ్యమంత్రి సన్నిహితులు, కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో అదికారుల మాటకే ప్రాముఖ్యత ఇస్తున్నారని, ఆచరణలో ఏమి జరుగుతుందో ఆలోచించడం లేదని ఒక ఎమ్మెల్సీ అన్నారు.ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన వివిధ పదకాలు కిరణ్ కు పాజిటివ్ వాతావరణం తెచ్చిపెట్టాయని, ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచినా ప్రజలు పరిస్థితిని అర్ధం చేసుకుంటారని అదికారులు కిరణ్ కు చెబుతున్నారని, ఆయన కూడా ఇదే అభిప్రాయానికి వస్తున్నారన్న భావన కలుగుతోందని కాంగ్రెస్ నేతలు కొందరు చెబుతున్నారు.అయితే ఇది ప్రమాదకరమని, కరెంటు ఛార్జీలు పెరిగితే ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత వస్తుందని , చంద్రబాబునాయుడు కూడా విద్యుత్ ఛార్జీలను పెంచే దెబ్బతిన్నారని వా...