పోస్ట్‌లు

aatmahuti harish rao tdp congress trs telangana samaikhyandhra jai telangana political news political articls hot news hot gossips telugutalli notebooks లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మా తెలుగుతల్లి పేపర్లను తగులబెట్టండి

చిత్రం
ఆగస్టు ఒకటి నుంచి ప్రకటించిన విధంగా తెలంగాణ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ఓ అడుగు ముందుకేసి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న మా తెలుగుతల్లి అనే గేయం ఉన్న పేజీలను చించేయాలని హరీష్ రావు అన్నారు. అంతేకాదు.. చించేసిన ఆ పేజీలను తగులబెట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని టీచర్లంతా దీన్నీ ఓ ఉద్యమంలా చేపట్టాలని ఆయన కోరారు. అలాగే 14 ఎఫ్ రద్దుచేసే వరకు ఎలాంటి పరీక్షలను నిర్వహించొద్దని హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజాప్రతినిధులంతా కలిసి రాజీనామాలు చేయాలని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె విజయవంతం కావాలంటే.. అంతా రాజీనామాలు చేయాల్సిందే అని అన్నారు.