ఏడుకొండలవాడా.. ఏమిటీ దారుణం..?
సాక్షాత్తూ ఆ ఏడుకొండల వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో ఎన్నో ఘోరాలు జరుగుతు న్నాయి. స్వామి వారు కొలువున్న ఆనందనిలయం ప్రాంగణం అపవిత్రం అవుతోంది.. కొంతమంది భక్తులు చేస్తున్న ఆకృత్యాలతో ఆకృత్యాలతో తిరుమల పవిత్రతకి ప్రమాదం ఏర్పడుతోంది.. పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం తిరుమలలో అవినీతి, ఆరచకత్వాలతో పాటు, పరమత ప్రచారాలు లాంటి అభ్యంతకర సంఘటనలు ఈ మధ్య చాలా జరుగుతు న్నాయి. తాజాగా ఇలా ఎక్స్‌ట్రాలు చేసిన ఓ బ్యాచ్‌కు పోలీసులు శ్రీకృష్ణ జన్మస్థానం చూపించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల్లో మందుబాబులు ఎక్కువై పోతున్నారు. అధికారులు ఎన్ని రకాలుగా కట్టడి చేస్తున్నా మందుబాబులు డోన్ట్ కేర్ అంటున్నారు. తిరుమలలో మద్యం, మాంసం, పొగాకు వినియోగం పై నిషేధం ఉన్నప్పటికీ మద్యం, పొగాకు ఉత్పత్తులు తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. అయితే..విజయవాడ నుంచి వచ్చిన ఈ మందు బాబుల బ్యాచ్ తిరుమల వరకు వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకు.. అనుకున్నారేమో..తిరుపతిలోని మాధవం కాటేజ్‌లోనే మందు సిట్టింగ్ పెట్టేశారు. పీకలదాకా తాగిన తరువాత మత్తు తలెకెక్కి..వారి...