పోస్ట్‌లు

sakshi channel sakshni paper ys jagan madhu yashki jagati publications. bharati cements hot gossips hot news cbi enquiry లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జ‌గ‌న్ కేసులో ద‌మ్ము లేదా..?

చిత్రం
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆస్తుల కేసులో సిబిఐకి గట్టి సాక్షాధారాలు దొరకలేదా?హైకోర్టుకు సిబిఐ ఇచ్చిన నివేదికలో జగన్ ఆస్తులపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితేకాని ఏమైనా కేసులు ఉన్నది, లేనిది చెప్పజాలమని సిబిఐ స్పష్టంచేసినట్లు కధనాలు వస్తున్నాయి.జగన్ ఆస్తులపై ప్రాధమిక విచారణ చేయవలసిందిగా హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర మంత్రి శంకరరావు జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించారని,కొందరు భూములు పొందినవారు కూడా ఇందులో ఉన్నారని శంకరరావు ఆరోపించగా, దానికి తెలుగుదేశం నాయకులు ఎర్రన్నాయుడు తదితరులో తోడయ్యారు. ఈ నేపధ్యంలో సిబిఐ దాదాపు మూడు వారాలు విచారణ జరిపినా చట్టవిరుద్దంగా లావాదేవీలు జరిగాయా? లేదా అన్నదానిపై సిబిఐ ఇంకా నిర్ధారణకు రాలేకపోయిందని అంటున్నారు. దానికి కారణం జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఆ సమయంలో భూములు కాని ప్రభుత్వం నుంచి లాభం పొందినట్లు కాని స్పష్టమైన ఆధారాలు లేకపోవడం, అలాగే ఈ కంపెనీలలో ఎవరూ తమను పెట్టుబడులకోసం బలవంతం చేశారని చెప్పకపోవడం కూడా ఇం...

జ‌గ‌న్ కేసులో కీల‌క మ‌లుపు..?

చిత్రం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు హైకోర్టు ఆదేశిస్తుందా? లేదా? అనేది సోమవారం వెలువడనుంది. తొలి దశ ప్రాథమిక విచారణలో జగన్ కంపెనీల డొంకను కదిలించిన సిబిఐ రెండో దశ విచారణలో ఆయా కంపెనీల పెట్టుబడుల మూలాల్లోకి చొచ్చుకునిపోయింది. దీనికి సంబంధించిన నివేదికను సోమవారం కోర్టుకు సమర్పించనుంది. అనంతరం, జగన్ అక్రమాస్తుల కేసును హైకోర్టు సోమవారం విచారించనుంది. ఈ అంశంలో ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని భావించిన కోర్టు తాజా నివేదికపై ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో నెలకొంది. ఒకవేళ పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలంటూ సిబిఐని హైకోర్టు ఆదేశిస్తే జగన్‌కు కష్టకాలం వచ్చినట్లేనని ఈ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా సిబిఐ తన మొదటి విచారణ నివేదికకు అదనంగా రూపొందించిన రెండో నివేదికలో బెంగళూరు కంపెనీలైన సండూర్ పవర్, జననీ ఇన్‌ఫ్రా, కార్మెల్ ఏసియాపై ప్రధానంగా దృష్టి సారించింది.

సోమ‌వారం వ‌ర‌కూ ఆగాల్సిందే..

చిత్రం
జగన్ ఆస్తుల కేసును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.సిబిఐ జగన్ ఆస్తులకు సంబందించి సమర్పించిన నివేదికను ఇంకా పరిశీలించలేదని హైకోర్టు న్యాయమూర్తులు చెప్పారు. సిబిఐ నివేదిక కాపీ కావాలని కోరగా ఇంకా తాము కూడా చూడలేదని కవర్ ను న్యాయమూర్తులు చూపారు.అయితే కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయవలసిందిగా వారు కోరారు. అయితే కోర్టులోనే న్యాయమూర్తులు నివేదికను తిలకించారు.. కేసు పూర్వాపరాలు పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. అలాగే హైకోర్టుకు రాసిన లేఖలోని అంశాలపై అందరి వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా జగన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ పిటిషన్ దారుడైన శంకరరావు విశ్వసనీయత గురించి అలాగే, ఇలాంటి లేఖలను పరిగణనలోకి తీసుకోవడంపై గతంలో సుప్రింకోర్టు చెప్పిన విషయాలను కూడా ప్రస్తావించారు. కాగా పూర్తికాని ప్రాధమిక విచారణను కొనసాగించడానికి సిబిఐ అనుమతి ఇచ్చింది. ఎమ్. ఆర్.ప్రాపర్టీస్, జగన్ ఆస్తల వ్యవహారాలపై మంత్రి శంకరరావు రాసిన లేఖలు రాయడం, తెలుగుదేశం నాయకులు ఎర్రన్నాయుడు ప్రభృతులు కూడా తోడవడం తెలిసిందే.

జ‌గ‌న్ భ‌విష్య‌త్తు అందులో..

చిత్రం
జగన్ ఆస్తుల కేసులో ప్రాధమిక విచారణ నివేదికను సిబిఐ రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది.జగన్ ఆస్తులపై విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ శంకరరావు రాసిన ఒ క లేఖ ఆధారంగా హైకోర్టు సిబిఐని ప్రాధమిక విచారణ జరపవల సిందిగా ఆదేశించింది.రెండువారాలపాటు ఇరవై మూడు కంపెనీలను సిబిఐ విచారించింది. ఆయా కంపెనీలకు సిబిఐ నోటీసులు జారీ చేయడం, ఆ కంపెనీల వారంతా తమ వద్ద ఉన్నడాక్యుమెంట్లను సమర్పించడం, కొందరి నుంచి వారు గంటల తరబడి ప్రశ్నల రూపంలో సమాచారం సేకరించడానికి కూడా యత్నించారు.అయితే రెండువారాలలో హైకోర్టు కోరుకున్నప్రకారం నివేదిక ఇవ్వడం విశేషం. సాధారణంగా ఇంత పెద్ద కేసులలో టైమ్ సరిపోదని విచారణాధికారులు చెబుతుంటారు. కాని సిబిఐ డిఐజి సరిగ్గా రెండువారాలోనే నివేదిక ఇవ్వడం అభినందనీయం. అయితే ఇప్పుడు ఈ నివేదికలో ఏముందన్నది ఆసక్తికరం. సీల్డ్ కవర్ లో జగన్ భవితవ్యాన్ని హైకోర్టుకుఇచ్చారని అనుకోవచ్చు. బుధవారం నాడు హైకోర్టు ఈ కవర్ ను విప్పి అందులోని విషయాలను వెల్లడిస్తుందా? లేక మరి కొంత కాలం తీసుకుంటుందా అన్నది చూడాలి.

కొండంత రాగం తీసి..

చిత్రం
కొండంత రాగం తీసి అదేదో పాట పాడిన‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హారంలో సిబిఐ ప‌ని ఉంటుందా..?  ప్ర‌స్తుతం అవే అనుమానాలు రేకెత్తుతున్నాయి. జ‌గ‌న్ ప‌గ‌డ్బంధీ ప్ర‌ణాళిక ద్వారా త‌న సామ్రాజ్యాన్ని నిర్మంచుకున్నారని, చ‌ట్టానికి లొంగ‌కుండా ఉండేందుకు ఎంతో తెలివిగా పావులు క‌దిపార‌ని భావిస్తున్నారు. సిబిఐ విచార‌న పూర్త‌యి మంగ‌ళ‌వారం నాడు హైకోర్టుకి నివేదిక‌ని స‌మ‌ర్పించ‌నున్న సిబిఐ ఆ నివేదిక‌లో ఏం పేర్కొంటుందో అన్న‌ది ఇప్పుడు అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడే సిబిఐ ఎలాంటి నివేదిక ఇస్తుందన్నదానిపై ఊహాగానాలు వస్తున్నాయి.సిబిఐ అన్ని విషయాలను , అన్నికోణాలలో పరిశీలించినా, చట్టవిరుద్దంగా ఏ వ్యవహారం జరిగిందన్న అభిప్రాయానికి రాలేకపోయిందని జగన్ వర్గం భావిస్తుండగా, జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించే ఒక పత్రిక తొంభై శాతం నిర్ధారణ అయినట్లు పేర్కొంది. మరో పత్రిక మాత్రం ప్రాధమికంగా ఆధారాలు ఉన్నట్లు అభిప్రాయపడినా,మరింత లోతుగా విచారణ జరిపి నిగ్గు తేల్చాలని సిబిఐ హైకోర్టును కోరవచ్చని రాసింది.ఒకవేళ సిబిఐ కోరిన మేరకు సమగ్ర దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతించిన పక్షంలో క...