నల్లధనం ఉన్నది ఇంతేనా..?
నల్లధనం పెద్ద ఎత్తున దేశాన్ని దాటి వెళ్లిందని.. మన నేతలు చెబుతుంటారు. వాటి విలువ కొందరేమో.. 70 లక్షల కోట్లని.. మరికొందరేమో.. 40 లక్షల కోట్లని వాళ్ల అనుభవం ప్రకారం చెబుతుంటారు. కానీ అసలు విషయమేంటంటే.. స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల సంపదను.. స్విస్ జాతీయ బ్యాంకు ఒకటి తెలిపింది. 2010 ఏడాదిలో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో పోగేసిన ధన విలువ కేవలం.. 11 వేల కోట్లేనట. తమ దగ్గరున్న గణాంకాల ద్వారానే ఈ వివరాలు చెబుతున్నామని.. స్విస్ జాతీయ బ్యాంక్ అధికార ప్రతినిధి వాల్టర్ మీయర్ వెల్లడించారు. అయితే 2009 లో ఇది 12 వేల కోట్లని.. 2008 లో 13 వేల కోట్లని తెలిపారు. అయితే ఆర్థిక సంక్షోభ సమయంలో స్విస్ బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున డబ్బును విత్ డ్రా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆర్థిక సంక్షోభం సమయంలోనే అక్కడి అతిపెద్ద బ్యాంక్ అయిన యూబీఎస్ తో పాటు.. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు నష్టాలపాలయ్యాయి. మరోవైపు నల్లధనంపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వెంటనే బ్లాక్ మనీని దేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా దీక్షలు కూడా చేస్తున్నారు. అయితే అక్కడి ప్రతినిధుల చెబుతున...