పోస్ట్‌లు

rajanikanth chennai tamilanadu cinema news robo rana cinema reviews cine bits london లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

చికిత్సకోసం సింగపూర్ కు రజనీ

చిత్రం
ప్రఖ్యాత సినీనటుడు రజనీకాంత్ కు ఇంకా అనారోగ్యంతోనే బాధ పడుతున్నారు. ఆయన బ్రాంకైటీస్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నారు. అన్ని అవయవాలు చికిత్సకు బాగానే స్పందిస్తున్నాయని వైద్యులు చెబుతున్నప్పటికీ, ఇంకా మెరుగైన వైద్యం కోసం సింగపూర్ కు తీసుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం చెన్నై లోని రామచంద్ర ఆస్పత్రిలో రజనీకాంత్ చికిత్స పొందుతున్నారు.రజనీకాంత్ కు కోట్లాదిమంది అబిమానులు ఉన్నారు. వారంతా రజనీ ఆరోగ్యం బాగుపడాలని పూజలు చేస్తున్నారు. కాగా వైద్యులు ఈ అబిమానుల తాకిడి తట్టుకోలేక రజనీ కూడా మామూలు మనిషే నన్న సంగతి గుర్తు ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రజనీ కాంత్ రాణ సినిమా షూటింగ్ సమయం నుంచి అనారోగ్యానికి గురయ్యారు. రజనీ సత్వరమే కోలుకుంటారని ఆశిద్దాం

లండన్ వెళ్తున్న రజనీ

చిత్రం
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ త్వరలో లండన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది .జీర్ణాశయానికి ఇన్ఫెక్షన్ సోకి ప్రస్తుతం కోలుకున్న రజనీకి మూత్ర పిండాల్లో కూడా సమస్యలు వున్నట్టు  వైద్యులు గుర్తించారు మెరుగైన పరీక్షలతో పాటు చికిత్స  కూడా లండన్లో పొందే అవకాశాలు వుండటం తో అక్కడికి వెళ్తున్నట్టు సమాచారం. అలాగే వాతావరణ మార్పు, కొంత విశ్రాంతి కూడా తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. గత నెల 29 న రాణా చిత్రం షూటింగ్ సందర్భం గా రజనీ కాంత్ అస్వస్థత కు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెల్సిందే. ఒక దశలో ఐసీయు కి ఆయనను తరలించారు. దీంతో అభిమా నులు  టెన్షన్ కి గురైనారు. ఈ సందర్భంగా రకరకాల పుకార్లు కూడా వ్యాప్తిలో కొచ్చాయి. పెద్ద ఎత్తున అభిమానులు పూజలు నిర్వహించారు. ఎట్టకేలకు అయన కోలుకున్నారు ,ఐసీయు నుంచి జనరల్ వార్డ్ కి తరలించారు .ప్రస్తుతం రజనీ ఉల్లాసం గా ఉత్సాహం గా వున్నారు .