పోస్ట్‌లు

drugs kokain brown sugar lovers teenagers curruptions sensetional news national news hyderabad banjara hills collage students లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

డ్రగ్స్ తో పట్టుబడిన ప్రేమికులు

చిత్రం
హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంద నడానికి తాజా ఘటనే నిదర్శనం. కొద్దిరోజుల క్రితం రవితేజ సోదరులుతో పాటు మరికొంతమంది పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే శనివారం సాయంత్రం జూబ్లిహిల్స్ లో ఓ ప్రేమికుల జంటనుంచి పదిగ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు ఉన్నతవిద్యావంతులు. ప్రేమికుడు అహ్మదాబాద్ ఐఐఎమ్ లో చదువుతుండగా, ఆమె హైదరాబాద్ లోని దక్కన్ కాలేజీలో ఎమ్బీబీఎస్ చదువుతుంది. వీరిపై గత కొద్దిరోజులుగా నిఘా పెట్టిన పోలీసులకు ఇవాళ కొకైన్ తో పాటు పట్టుపడ్డారు. వీరు సెలవు రోజుల్లో పబ్ లకు వెళ్లి , వీటి ద్వారా ఎంజాయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితోపాటు కొంతమంది మిత్రులు కూడా ఉన్నట్లు చెప్తున్నప్పటికీ ఎవరూ దొరకక పోవడం విశేషం. యువతరం చెడిపోతుందనడానికి, పక్కదారి పడుతుందనడానికి ఇదొక తాజా ఉదాహరణ.