ఓపెన్ బ్యాలెటా..? సీక్రేట్ బ్యాలెటా..?
స్పీకర్ ,డిప్యూటి స్పీకర్ ఎన్నిక బహిరంగంగా జరగుతుందని శాసనసభ న్యాయ సలహాదారు జంధ్యాల రవిశంకర్ చెప్పడం పై టిడిపి మండి పడుతోంది. ముందుగా రహస్య బాలెట్ జరుగుతుందని ప్రకటించగా, ఇప్పుడు అసెంబ్లీ అధికారులు ఓపెన్ బాలట్ కుఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వంలో వెన్నులో చలిపుట్టే రహస్య బాలెట్ బదులు ఓపెన్ బాలెట్ నిర్వహిస్తోందని టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఆరోపించారు.రెండువేల ఆరులో సుప్రిం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా ఓటింగ్ రహస్యంగా జరపాల్సి ఉందని ఆయన అన్నారు. అయితే మకు బులెటిన్ లో తమకు తెలియచేసినదాని ప్రకారం స్పీకర్ టేబుల్ పై బాలెట్ బాక్స్ ఉంటుందని, దానిలో ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారని , కాని తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఓపెనె బాలెట్ సిస్టమ్ కు వెళుతున్నారని, అలాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని రేవంత్ డిమాండు చేశారు.అలాకాని పక్షంలో ప్రభుత్వం నైతికంగా ఓటమిని అంగీకరించినట్లేనని ఆయన అన్నారు. స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వార్తలని ఎప్పటి కప్పుడు మీకందిస్తుంది 5amnews.com.