రెండుగంటలు జగన్ అదృశ్యం
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ తనను వేధిస్తున్నదన్న అంశాన్ని దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులకు వివరించేందుకు ఢిల్లీ వెళ్లిన వై.ఎస్. జగన్ ఒక షెడ్యూల్ ప్రకారం వారితో భేటీ అవుతున్నారు. అయితే సోమవారం రాత్రి కాస్త పొద్దుపోయాక రెండు గంటల సమయం ఎవరికి తెలియకుండా రహస్య ప్రదేశానికి వెళ్లివచ్చారని రాజకీయవర్గాలలో గుప్పుమంది. బహుశా కాంగ్రెస్ హైకమాండ్ తో రాజీ యత్నాలలో భాగంగానే ఆయన ఈ రహస్య భేటీ ఏవరైనా ముఖ్యులతో జరిపి ఉండవచ్చని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ను కలవడానికి వెళ్లారని ప్రచారం చేస్తోంది. కాగా కొన్ని వర్గాల కధనం ప్రకారం ఆయన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలవడానికి వెళ్లి ఉండవచ్చు. ప్రణబ్ ముఖర్జీ గతంలో జగన్ తో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తరపున సంప్రదింపులు జరిపారు.జగన్ పట్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం . అంతేకాకుండా ప్రధానికి లేదా సోనియాగాంధీకి గాని ఏదైనా సంకేతం పంపాలంటే ప్రణబ్ సరైన వ్యక్తి అవుతారని కూడా భావించి ఉండవచ్చని అం...