రెండుగంట‌లు జ‌గ‌న్ అదృశ్యం


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ తనను వేధిస్తున్నదన్న అంశాన్ని దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులకు వివరించేందుకు ఢిల్లీ వెళ్లిన వై.ఎస్. జగన్ ఒక షెడ్యూల్ ప్రకారం వారితో భేటీ అవుతున్నారు. అయితే సోమవారం రాత్రి కాస్త పొద్దుపోయాక రెండు గంటల సమయం ఎవరికి తెలియకుండా రహస్య ప్రదేశానికి వెళ్లివచ్చారని రాజకీయవర్గాలలో గుప్పుమంది. బహుశా కాంగ్రెస్ హైకమాండ్ తో రాజీ యత్నాలలో భాగంగానే ఆయన ఈ రహస్య భేటీ ఏవరైనా ముఖ్యులతో జరిపి ఉండవచ్చని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ను కలవడానికి వెళ్లారని ప్రచారం చేస్తోంది. కాగా కొన్ని వర్గాల కధనం ప్రకారం ఆయన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలవడానికి వెళ్లి ఉండవచ్చు. ప్రణబ్ ముఖర్జీ గతంలో జగన్ తో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తరపున సంప్రదింపులు జరిపారు.జగన్ పట్ల కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం . అంతేకాకుండా ప్రధానికి లేదా సోనియాగాంధీకి గాని ఏదైనా సంకేతం పంపాలంటే ప్రణబ్ సరైన వ్యక్తి అవుతారని కూడా భావించి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని, ఆయన కుమార్తె పుట్టిన రోజు కావడంతో కుటుంబంతో బయటకు వెళ్లారు తప్ప ఇంకొకటి కాదని కొట్టిపారేస్తున్నారు.కాగా కొంతకాలం క్రితం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒక గంటపాటు ఎవరికి చెప్పకుండా రహస్య పర్యటన చేయడం, ఆయన ప్రత్యర్ధులు హోం మత్రి చిదంబరాన్ని చంద్రబాబు కలవడానికి వెళ్లారని ప్రచారం చేయడం, దానిని ఆయన తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి సమస్య జగన్ కు కూడా ఎదురు కావడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!