వ‌డ్డించేందుకు సిద్దం..


రాష్ట్ర ప్ర‌భుత్వం వ్యాట్ వ‌డ్డ‌న‌కి సిద్ద‌మైంది. 2,500 కోట్ల రూపాయ‌ల ఆదాయం స‌మ‌కూర్చుకోవ‌డానికి 4000 వ‌స్తువ‌ల‌పై వ్యాట్‌ని పెంచెందుకు సిద్ద‌మైంది. నిత్యావ‌స‌ర వ‌స్తువులైన వంట‌నూనె, ప‌ప్పులు నుండి గ్యాస్ వ‌ర‌కు అన్నింటికీ ఈ వ్యాట్‌ని పెంచింది. వ‌స్తాల‌పై కూడా వ్యాట్‌ని పెంచేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌ప‌డింద‌ని తెలుసుకుని వ‌స్త్ర‌వ్యాపారులు నిర‌స‌న‌ని తెలియ‌జేసిన‌ప్ప‌ టికీ ప్ర‌భుత్వం మాత్రం వ్యాట్‌ని పెంచేందుకునే సిద్ద‌ప‌డింది. దీనిపై విప‌క్షాలు ఆందోళ‌న చేసిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. ప్ర‌స్తుతం పెరిగిన వ్యాట్ తో వంట‌గ్యాస్ ధ‌ర ఒక సిలిండ‌ర్‌పై 4 రూపాయ‌లు పెరుగుతుంది. అలాగే నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌పై పెరిగిన భారం కంటికి క‌నిపించ‌నిది, పెరిగిన ధ‌ర‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సామాన్య వ్య‌క్తి వీటికి అల‌వాటుప‌డి బ్ర‌తుకు బండిని ముందుకు సాగించ‌డం త‌ప్ప చేసేదేముంది..?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!