
హైదరాబాద్‌లో ఎంతో అట్టహాసంగా జరిగే నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా కొన్ని అపశృతులు దొర్లినప్పటికీ లక్షలాది భక్తులతో జరిగే నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ హైకోర్టు బాంబు పేలుళ్ళ నేపథ్యంలో తీవ్రవాదుల ముప్పు పొంచివున్నదన్న అనుమానాలు బలపడటంతో పోలీసులు భారీ భద్రతలని ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండడంతో ఈ ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. కాగా హైదరాబాద్‌లోనే పెద్ద వినాయకుడిగా పేరు పొందిన ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం తెల్లవారు జాము మూడు గంటల ఏభై నిమిషాలకు పూర్తి అయింది. లక్షలాది మంది భక్తులు ఉత్సహాంగా భాగ్యనగరంలో జరిగిన గణేష నిమజ్జనంలో పాల్గొన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ ప్రాంతం జై భోలో గణేష్ మహరాజ్‌కీ జై అన్న నినాదాలతో మారుమ్రోగింది. అంగరంగ వైభవంగా జరిగిన గణేశుడి నిమజ్జనాన్ని అన్ని టీవీ ఛానెళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోట్లాది మంది కూడా ఈ ఉత్సవాన్ని చూసే అవకాశం కలిగింది. మొత్తానికి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న డిజిపి దినేష్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఎకె. ఖాన్‌లని అభినందించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి