పోస్ట్‌లు

chandrababu naidu tdp national politicals lk adwani soniagandhi manmohan singh political news political gossips hot news hot gossips k tr taraka rama rao లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బాల‌య్య నంది బాబుకి ఇవ్వాలి..

చిత్రం
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటించడం ఓ పెద్ద జోక్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరాటం.. ఆస్తుల ప్రకటన చూస్తుంటే.. చంద్రబాబు బాగా నటిస్తున్నారని.. అసలు నందీ అవార్డు.. బాలకృష్ణకు కాకుండా చంద్రబాబుకు ఇవ్వాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితిల్లో జగన్ నే.. ఓదార్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలిస్తామన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ముందు ఆయన ఉద్యోగానికే భరోసా లేదన్నారు. సకల జనుల సమ్మెపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు 2011 లోనే తెలంగాణను సాధించుకుంటామని జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ స్పష్టం చేశారు. ఎవరు వచ్చినా.. ఎవరు రాకున్నా.. ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ రావాల్సిందే అని.. లేకుంటే ఈ సారి ఊరుకునే పరిస్థితి లేదన్నారు.