ప్రధాని కూడా పట్టించుకోలేదు..
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన గోడుని విలపించుకోవడానికి ఎవరినీ కలిసినా కనీసం ఆయన్ని గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. చివరికి ప్రధాని మన్మోహన్ సింగ్‌ని కలిసి తన గోడుని వెల్లగక్కుకున్నా ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు.. అంతేకాక జగన్‌ని ప్రధాని క్లాస్ పీకాడని కూడా అంటున్నారు. తన ఆస్తులపై చేస్తున్న సిబిఐ దాడులని వెంటనే ఆపాలని, తనపై కక్షసాధింపుకోసం సిబిఐని వాడుకోవడం ఎంతవరకు సమంజసమని వైఎస్ జగన్ ప్రధానిని ప్రశ్నించారు. దానికి ప్రధాని చాలా కూల్‌గా చట్టం తనపని తాను చూసుకుంటుందని.. తమకి కక్షపూరితంగా వ్యవహరించే అవసరం ఏమీ లేదని చెప్పేశాడంట.. రెండు రోజులుగా తన బాధని తెలుపడం కోసం ఢిల్లీలోని జాతీయ నాయకులని కలుద్దామని అనుకున్న జగన్‌కి ఎక్కడ వెళ్లినా సరైన స్పందన రాలేదని మీడియా కోడైకూస్తోంది.. ఈ నేపథ్యంలో ప్రధాని కూడా జగన్‌ని పట్టించుకోనట్టుగా మాట్లాడేసరికి జగన్ పరిస్థితి మరింత ఇరకాటంలో పడ్డట్టయింది. మరో ప్రక్క రాష్ట్రంలో జగన్ ఆస్తులపై సిబి...