పోస్ట్‌లు

janreddy errabelli dayakar rao saparete telangana telangana congress trs kcr ktr hot news poliical news political issuse లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పార్టీని కూడా వ‌దులుతారా..?

చిత్రం
అవసరమైతే పార్టీని వదలిపెట్టి కొత్త వేదికను ఏర్పాటు చేసుకుని తెలంగాణ ఉద్యమం చేపడతామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి చెప్పారని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు. జానారెడ్డితో తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు దయాకరరావు, మోత్కుపల్లి నరసింహలు, చందర్ రావు తదితరులు బేటీ అయ్యారు. తాము రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని, అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందని, తద్వారా తెలంగాణ ఏర్పాటు సాధ్యమవుతుందని దయాకరరావు బృందం జానారెడ్డితో వ్యాఖ్యానించింది. దానిపై జానారెడ్డి స్పందిస్తూ, తాను ఒక వ్యూహం ప్రకారం కార్యక్రమం రూపొందిస్తున్నానని, అవసరమైతే పార్టీని వదలి తెలంగాణ ఉద్యమం చేపట్టడానికి కూడా సిద్దమేనని, దానికి టిడిపి నేతలు కూడా సిద్దమా అని జానారెడ్డి ప్రశ్నించారని, అందుకు తాము కూడా సిద్దమేనని స్పష్టం చేశామని దయాకరరావు తెలిపారు.అయితే జానారెడ్డి బాద్యతలు నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, జానారెడ్డి పార్టీని వదలి వస్తానంటున్నప్పుడు ఇక మంత్రి పదవి గురించి...