విజయమ్మ స్పీచ్ అదరహో..!
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు , దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజ యలక్ష్మి తన తొలి ప్రసంగం ఆకట్టుకునేలా మాట్లాడారు.ఆమె కంట తడి పెట్టడమేకాదు. ఇడుపులపాయ ప్లీనరీ ప్రాంగణంలో ఉన్నవారందరితో కంట తడిపెట్టించేలా మాట్లాడడం విశేషం. రాజశేఖరరెడ్డి జీవిత ప్రస్థా నాన్ని తడుముతూ, రెండువేల తొమ్మిదిలో ఆయన మరణించే వరకు సాగిన ఘటనలతో పాటు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చాలా చక్కగా, ఆవేదన కలిగించే రీతిలో చెప్పడం ఆసక్తి కలిగించింది. సోనియాగాంధీ వద్దకు వెళ్లినప్పుడు జరిగిన ఘట్టాన్ని కూడా ఆమె వివరించిన తీరు. ఆ తర్వాత తన కుమారుడు జగన్ తో కలిసి సొంత పార్టీ పెట్టుకోవలసిన అవసరం ఎలా వచ్చిందో ఆమె వివరించారు.తన మరిది కి మంత్రి పదవి ఇచ్చినందుకు బాధ లేదని, కాని జరిగిన పరిణామాలు బాధ కలిగించాయని చెప్పడం కూడా ఆసక్తికరంగా ఉంది. రాజశేఖరరెడ్డి కి ఉన్న విశ్వసనీయత జగన్ కు కూడా ఉందని, అదే పట్టుదల, అదే మాటతప్పని గుణం జగన్ కు ఉ ందని చెబుతూ, జగన్ ను మీకు అప్పగిస్తున్నానని హృద్యంగా అన్న తీరు సహజంగానే సభికులను కలచివేస్తుంది. ఆమె ఒక సందర్భంలో కంట తడి కనిప...