టి.టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి ఆమోదింప చేసుకుంటే వారితో కలిసి పనిచేయడానికి సిద్దమని, తెలుగుదేశం కు రాజీనామా చేసి వస్తే వారి సవాళ్లు స్వీకరించడానికి కూడా సిద్దమని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలలో పోటీచేయరాదన్న తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు పెట్టిన షరతుపై టిఆర్ ఎస్ ఈ విధంగా స్పందిస్తోంది. టిఆర్ఎస్ మరో నేత తారకరామారావు ఎన్నికలలో పోటీచేయలేక టిడిపి ఇలా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు కూడా ఉద్యమంలో బాగమేనని ఆయన అంటే హరీష్ రావు ముందుగా టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని అంటున్నారు. కాగా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇదే విదన వినిపించారు. తను పోటీచేయరాదని అంటున్న టిడిపి నేతలు ముందుగా శాసనసభకు రాజీనామా చేసి ఆ తర్వాత తనను ప్రశ్నించాలని సూచించారు. తాను పోటీచేయాలా? వద్దా అన్నది పార్టీ నిర్ణయమని అన్నారు.