అంధా కానూన్
పెళ్ళయ్యాక బాజాలంటే పెళ్ళి సందడనుకుంటాం! పేలుళ్ళయ్యాక కెమేరాలు పెడితే న్యాయం గుడ్డిదనుకుంటాం! గుడ్డి కోర్టు గుమ్మం ముందు మళ్ళీ మళ్ళీ పేలుళ్ళు! గుర్రుపెట్టి నిదరోయే ప్రభుత ప్రతిభ ఆనవాళ్ళు! కెమేరాకు కన్నులుంటె చాలు మనకు పని లేదోయ్! చిన్న కునుకు తీయొచ్చు! బాంబు పేలితె లేవచ్చు! జనాభాను తగ్గించే ఉపాయం బాగుందోయ్! తీవ్రవాదులకు దేశం అప్పగిస్తె అంతేనోయ్! - చల్లా రామ ఫణి