పోస్ట్‌లు

harish rao trs chandrashekar rao cheruku sudhakar reddy high court ap political news political articls kodandaram kcr ready to deksha telangana లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఇదేమి మూలాల గొడ‌వ‌..?

చిత్రం
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కుటుంబ మూలాలు ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంపై టిఆర్ఎస్ మండిపడింది. చంద్రబాబు నాయుడు మూలాలు స్టూవర్టు పరంలో ఉన్నాయని విమర్శించింది. ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్, టిఆర్ ఎస్ మాచ్ ఫిక్సింగ్ అని చెబుతున్న ఆయన నిజానికి గత ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తో మాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర కాంగ్రెస్ నేతలు చంద్రబాబు దర్శకత్వంలో పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఏడు త‌రాలు ఇక్కడే..

చిత్రం
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు మూలాలు విజయనగరంలో ఉన్నాయన్న కధనాలు విస్తారంగా ప్రచారంలోకి రావడంతో ఆయన కుమారుడు దానిని ఖండించడానికి రంగంలో దిగారు. సిరిసిల్ల శాసనసభ్యుడు, టిఆర్ఎస్ ముఖ్య నాయకుడు తారకరామరావు తమ కుటుంబానికి సంబంధించి ఏడు తరాలు తెలంగాణలోనే ఉన్నాయని , ఆ విషయాన్ని నిరూపించడానికి తాము ఆదారలతోసిద్దంగా ఉన్నామని చెప్పారు.కాగా కెసిఆర్ తాత, తండ్రి విజయనగరం జిల్లా బుడ్డిపేట లో ఉండేవారని, వ్యాపారాల రీత్యా తెలంగాణ ప్రాంతానికి వెళ్లారని అక్కడి వెలమ కుటుంబాల నుంచి సమాచారం ప్రకారం స్థానికులు, టిడిపి నాయకులు మీడియాకు చెప్పారు. అంతేకాక కెసిఆర్ పూర్వికుల ఇల్లు అంటూ ఒక ఇల్లును చూపించడం, అక్కడ కెసిఆర్ ఇంటి పేరు అయిన కలవకుంట్ల వారు కొందరు ఉండడం వంటి ఆధారాలతో కెసిఆర్ పూర్వీకులు ఉత్తరాంద్ర నుంచి వలస వచ్చారని పేర్కొన్నారు. దీనిపై వెంటనే టిడిపి నేతలు కెసిఆర్ ఆంద్ర వాడంటూ ప్రచారం ప్రారంభించి ఆంద్రకు పిలిచి సన్మానిస్తామని ప్రకటనలు ఇవ్వడం ఆరంభించారు. ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్ర ప్రసాద్,నన్నపనేని రాజకుమారి తదితరులు ఇలాంటి ప్రకటనలు...

జ‌న‌వ‌రిలో తెలంగాణ‌..?

చిత్రం
తెలంగాణ అంశంపై కేంద్రం జనవరి మొదటి వారంలో ప్రకటన చేసే అవకాశం ఉందా?తెలంగాణ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం వచ్చే కొద్ది రోజులలో ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయవచ్చని టిఆర్ఎస్ వర్గాలకు, ఇటు కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందుతోంది. కేంద్ర ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ దీనిపై ఒక ప్రకటన చేయవచ్చని చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఏకాబిప్రాయం లేనందున తెలంగాణ ఇవ్వలేకపోతున్నామని కేంద్రం చేసే ప్రకటన సారాంశంగా ఉండవచ్చు. అంతేకాక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీపైకి నెపం నెట్టే యత్నం కూడా జరగవచ్చని అంటున్నారు. అలాగే ఆయా పార్టీలు తెలంగాణ అంశంలో యు టర్న్ తీసుకున్న విషయాన్ని కేంద్రం ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ టిఆర్ ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావులు కలుసుకున్నప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని , ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కుదరకపోవచ్చని పవార్ అన్నట్లుగా టిఆర్ఎస్ వర్గాల...