మాయావతి ఓ పవర్ బ్రోకర్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై వికీలిక్స్ పెద్ద బాంబే పేల్చింది. రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించడమే.. ఉత్తరప్రదేశ్ కు ఆమె చేసిన అభివృద్దిగా వికీలిక్స్ పేర్కొంది. కాగా అందరూ అనుకుంటున్నట్లుగానే.. మాయావతికి.. భారత ప్రధాని కావాలని కోరిక ఉన్నట్లు వికీలీక్స్ బయటపెట్టింది. ప్రధాని పదవే మాయావతి చిరకాల వాంఛగా పేర్కొంది. దీంతో పాటు.. మాయావతి కున్న చిత్రమైన అలవాట్లపై కూడా వికీలీక్స్ బయటపెట్టింది. ఆమే తీసుకునే అహారం.. అంతకుముందే ఇద్దరు రుచి చూడాల్సిందే. ఆహారం టేస్ట్ చేయడం కోసం.. ఓ ఇద్దరిని నియమించింది. అంతేకాదు.. రుచికరమైన వంటకాలు తయారు చేసేందుకు 9 మంది వంటగాళ్లు కూడా ఉన్నారట. ఇక అన్నింట్లో సంచలనం ఏంటంటే.. తనకిష్టమైన బ్రాండ్ చెప్పుల జత కోసం.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి.. ముంబైకి ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని పంపిచారని వికీలిక్స్ పేర్కొంది. చెప్పులు తీసుకొచ్చేందుకే ఈ విమానాన్ని ఖాళీగా పంపించిందని.. పేర్కొంది. ఇక 2007 మే తర్వాత.. ఆమే రాష్ట్రానికి చేసిన అభివృద్ది ఏమీ లేదని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని.. తెలిపింది. పుట్టిన...