పోస్ట్‌లు

sakshi channel sakshni paper ys jagan madhu yashki jagati publications. bharati cements hot gossips hot news cbi enquiry shankar rao kokayukta లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కోరి తెచ్చుకోవ‌ట‌మంటే ఇదే…!

చిత్రం
రాష్ట్ర మంత్రి శంకరరావుకు లోకాయుక్త షాక్ ఇచ్చింది. తన ఆస్తులపై విచారణ చేయవలసిందిగా కోరుతూ లోకాయుక్తకు రాసిన లేఖపై లోకాయుక్త స్పందించింది. శంకరరావు ఆస్తులు, ఆయన బందువుల ఆస్తుల వివరాలను సమర్పించవలసిందిగా లోకాయుక్త కోరడం ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. శంకరరావు తెలివిగా తనపై ఆరోపణలు వస్తున్నందున విచారణ చేయాలని కోరితే , లోకాయుక్త చేపట్టదని భావించారో, లేక మరో కారణంతో లేఖ రాశారో కాని అది శంకరరావు మెడకు చుట్టుకుంటుందా? లేక శంకరరావుకు క్లీన్ సర్టిఫికెట్ వస్తుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు శంకరరావు ప్రత్యర్దులు జోక్యం చేసుకుని శంకరరావుకు సంబందించి ఏవైనా లోగుట్టు వ్యవహారాలు కనుక (అవి ఉన్నట్లయితే) వాటిని లోకాయు క్తకు సమర్పిస్తే శంకరరావు ఇబ్బందులలో చిక్కుకోవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. జగన్ కేసులో శంకర రావు రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం ఒక సంచలనంగా ఉండగా, ఇప్పుడు శంకరరావు కేసు ఏ మలుపు తిరుగుతున్నందన్నది ఆసక్తికరం.