పోస్ట్‌లు

ys jagan mohan reddy shobha nagireddy errabelli dayakar rao k. chandrashekar rao kodandaram trs motkupalli narisimhulu k. chandrashekar rao political news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అవి తెలంగాణ ఆత్మత్యాగాలు కావా..?

చిత్రం
తెలంగాణ ఉద్యమంలో కొత్త , కొత్త ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా టిడిపి సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు చేసిన ఆరోపణ అత్యంత సంచలనాత్మకమైనది. ఏకంగా తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన ఇద్దరు శ్రీకాంతాచారి, యాదయ్యలది హత్య అన్నట్లుగా నరసింహులు అరోపిస్తున్నారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు రాక్షసుడు, కుంభకర్ణుడు, సమ్మెలు ప్రజలకు, సంపద కెసిఆర్ కు అంటూ విరుచుకుపడ్డారు. అదే క్రమంలో ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ శ్రీకాంతాచారి, యాదయ్యలపై కిరోసిన్ పోసి చంపించింది నిజంగాదా? అని ప్రశ్నించారు. వీరిద్దరి సంగతి ఏమోకాని అంతకుముందు ఒకరిద్దరి విషయంలో కూడా కొన్ని అనుమానాలు స్థానికంగా వచ్చినా, తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న తరుణంలో అలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా వ్యవహరించడానికి నాటి ప్రభుత్వం ప్రాదాన్యత ఇచ్చింది. ఈ నేపద్యంలో మోత్కుపల్లి శ్రీకాంతాచారి, యాదయ్యలది ఆత్మహత్య కాదని, హత్య అని సంచలన ఆరోపణ చేసి సరికొత్త వివాదానికి మోత్కుపల్లి తెరదీశారు.కెసిఆర్ దీనిని చేయించాడని మోత్కుపల్లి రాజకీయ ఆరోపణ చేశారు....