బద్రీనాథ్ మూవీ రివ్యూ..
సంస్థ: గీతా ఆర్ట్స్ నటీనటులు: అల్లు అర్జున్, తమన్నా, ప్రకాష్ రాజ్, కెల్లీ దోర్జ్, అశ్వనీ కల్‌శేఖర్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, గీతాసింగ్, కృష్ణభగవాన్ తదితరులు. రచన: చిన్నికృష్ణ సంగీతం: ఎం.ఎం.కీరవాణి నిర్మాత: అల్లు అరవింద్ దర్శకత్వం: వివి వినాయక్ అల్లు అర్జున్, వివివినాయక్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం బద్రినాథ్. నేడు ప్రపంచ వ్యాప్తంగా మూడు భాషల్లో విడుదలయింది.. కథ విషయానికి వస్తే.. భీష్మనారాయణ్ (ప్రకాష్‌రాజ్) మన దేశంలో ఉన్న 138 పుణ్యక్షేత్రాలను కాపాడటానికి క్షేత్రపాలకులను తయారుచేయాలని పూనుకుంటాడు. అలా శిక్షణ ఇచ్చిన వారిని ఆయా క్షేత్రాలకు క్షేత్ర పాలకులుగా పంపుతారు. అలా శిక్షణ తీసుకున్న యోధులలో ఒకరు బద్రి(అల్లు అర్జున్). బద్రిలోని ఆకుంఠిత దీక్ష, పట్టుదల భీష్మనారాయణకి బాగా నచ్చుతుంది. బద్రినాథ్‌కి క్షేత్రపాలకుడిగా ఉండేందుకు బద్రినాథ్ క్షేత్రం నియమించబడుతుంది. బద్రినాధ్ క్షేత్రానికి అలకనంద (తమన్నా) వస్తుంది. అలకానంద నాస్తికురాలు, ఆమెకి దేవుడంటే ఇష్టం వుండదు. అయితే బద్రి ఆమెకి దే...