చంద్రబాబుతో అన్నాహజారే బృందం భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సామాజిక కార్యకర్త అన్నా హజారే అనుచరుడు అరవింద్ క్రేజీపాల్ ఆధ్వర్యంలో బృందం శనివారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లోక్‌పాల్ బిల్లుపై వారు చ ర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అన్నా హజారే చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా చంద్ర బాబును వారు కోరారు. నేడు ప్రధానమంత్రితో అన్నాహజారే బృందం భేటీ అవుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని పార్టీల మద్దతు తీసుకోవడం కోసం అన్నా హజారే బృందం అన్నిపార్టీల నాయకులని ప్రత్యేకంగా కలుసుకుంటు న్నారు. అందరి మద్దతుతో జన్‌లోక్‌పాల్ బిల్లుని పగడ్భంధీగా తీసుకురావాలన్నది అన్నా హజారే బృందం ఆకాంక్ష