హీరోయిన్ ఓరియంటెడ్‌గా 100% లవ్
నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన ‘100% లవ్’చిత్రం తెలుగులో విజయవంతంగా నడు స్తోంది. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవటంతో దాని రీమేక్ చేయడం కోసం కొందరు నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. గతంలో మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్. లగేరహో మున్నాభాయ్ చిత్రాల రైట్స్ తీసుకుని తెలుగు, తమిళంలో చిరంజీవి, కమల్‌హాసన్‌లతో రూపొందించిన జెమిని ఫిలిం సర్క్యూట్ 100 పర్సంట్ లవ్ రైట్స్ తీసుకుని హిందీలోరీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రం హిందీలో రీమేక్ చేయటానికి జెమినీ ఫిల్మ్ సర్కూట్ వారు ఈ రైట్స్ ని ఎనభై ఐదు లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని హీరోయిన్ ఓరి యెంటెండ్ చిత్రంగా తీర్చిదిద్దాలని వారు ఆలోచిస్తున్నట్లు అందుకు అనుగుణంగా అక్కడ టాప్ హీరోయిన్ గా ఉన్న సోనాక్షి సిన్హాను తీసుకోనున్నట్లు చెప్తున్నారు. తెలుగులోనూ మొదట హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలోనే కథ చెప్పి దానికి దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్ ని పెడదామని అనుకున్నారు. కానీ నాగార్జున పట్టుదలతో దానికి స్వస్ది చెప్పి హీరో వైపు నుంచి కథ నడిపారు. ఇక హిందీలోనూ సుకుమారే డైరక్ట్ చేస్తాడు కాబట్టి తనకు ఇష్టం వచ్చినట్లు తీస్తాడని అంట...