యాచకులంతా అక్కడివారే..
కాంగ్రెస్ నాయకుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఎంత బిజీగా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. మరి ఈయన బిచ్చగాళ్ళను ఇంటర్వూ ఎప్పుడు చేశాడనే సందేహం మీకు కలగ వచ్చు. రాహుల్ నిజంగానే ఢిల్లీలో ఉన్న బిచ్చగాళ్ళను ఇంటర్యూ చేశాడు. రాహుల్ గాంధీ బిచ్చగాళ్ళను ఇంటర్వూ చేయడం ఏంటని అనుకుంటున్నారా ? మరేం లేదండి. వచ్చే ఏడాది ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకోసం యూపీలో 5 రోజుల ప్రచారం రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ యాత్ర కైసర్ గంజ్, బహ్రయిచ్ లలో జరిగింది. ఈయాత్రలో ఆయన మాయావతి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ… సొంత రాష్ర్టంలో ఉపాది కరువై యుపీ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో యాచకులుగా జీవిస్తున్నారని, రాజకీయ నాయకులు తమ కారు అద్దాలను దించి చూడాలి. అప్పుడే నాయకులకు వారు కనిపిస్తారని అన్నారు. ప్రస్తుతం నేను అదే పని చేశాను కాబట్టే నాకు తెలిసిందని వ్యాఖ్యానించారు. ‘నేను ఢిల్లీ వీధుల్లో ఎంతో మంది యాచకులను చూశాను. వారిని నేన...