దావూద్ సోదరుడిపై కాల్పులు
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ పై దక్షిణముంబాయిలో కాల్పులు జరిగాయి. జేజే ఆస్పత్రికి సమీపంలో జరిగిన ఈ ఘటనలో కస్కర్ గన్ మెన్ అక్కడికక్కడే మరణించారు. కస్కర్ నివాసానికి దగ్గర్లోనే ఈ ఘటన జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కస్కర్ దగ్గర్లోకి వచ్చి కాల్పులు జరపడంతో అలర్ట్ అయిన కస్కర్ గన్ మెన్ వెంటనే స్పందించడంతో ఆయనపై కూడా కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించారు . అయితే కస్కర్ కు పెద్దగా గాయాలేమీ కాలేదని సమాచారం. ఇటీవల లాడెన్ మరణించడంతో దావూదే నెంబర్ వన్ వాంటెడ్ గా ఉన్నారు. ఇతను పాకిస్థాన్ లో ఉన్నట్లు భారత్ ఇప్పటికే ప్రకటించింది కూడా. ఈనేపథ్యంలో ఘటన జరగడంతో ఎవరిని అనుమానించాలో పోలీసుల ఇంకా ఒక అవగాహనకు రాలేదు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.