`టెర్రర్’ లక్ష్యాలు
న్యాయవ్యవస్థను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు కోర్టులకు `టెర్రర్’ టార్గెట్ పాలనావ్యవస్థపైనా దాడులు ఉగ్రవాదుల వ్యూహాల్లో మార్పులు దేశ అంతర్గత భద్రతకు ముప్పు వ్యూహాత్మకంగానే దాడులు దేశంలో ఉగ్రవాదుల దాడుల వెనుక బలమైన వ్యూహరచన కనబడుతోంది. దేశ అంతర్గత భద్రతను సవాల్ చేసే దిశగా టెర్రరిస్టులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు లక్ష్యాలను మార్చుకుంటున్నారు. దేశంలో ఉగ్రవాద పోకడల తీరును నిశితంగా గమనిస్తే, వారి వ్యూహాలేమిటో స్పష్టంగానే అర్థమవుతాయి. దాడులకు దిగిన ప్రతిసారీ, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలనే వారు లక్ష్యాలుగా ఎంచుకోవడంలేదు. అలాగే, రైళ్లు, బస్సులు, పార్థనా మందిరాల్లోనూ బాంబులు పెట్టే పద్ధతినే ఎప్పుడూ పాటించడంలేదు. అంతకంటే ముక్కుసూటిగా, దేశ పాలనా వ్యవస్థనీ, న్యాయవ్యవస్థనీ నిర్వీర్యం చేసేదిశగా కూడా దాడులకు దిగుతున్నారన్నది సుస్పష్టం. ఈ మధ్యనే జరిగిన ఢిల్లీ పేలుళ్లు మరోసారి ఈ వాదనను బలోపేతం చేశాయి. 2000 సంవత్సరం డిసెంబర్ 22న ఉగ్రవాదులు ఎర్రకోటపైనే దాడికి దిగా...