రాజకీయ చరిత్రలో మహిళా ముఖ్యమంత్రులు..
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇద్దరు నారీమణులు వీరోచితంగా పోరాడి అధికార పీఠాన్ని సొంతం చేసుకుని ముఖ్యమంత్రి పదవి అధిష్టించబోతున్నారు. అయితే ఇప్పటి వరకూ దేశంలో ఎంత మంది మహిళలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారో తెలుసుకుందాం.. 1963-67 ప్రాంతంలో ఉత్తర ప్రదేశ్‌లో సుచేతా కృపలానీ కాంగ్రెస్ పార్టీ తరపున దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసారు. 1972లో ఒరిస్సా ముఖ్యమంత్రిగా నందినీ శతపతి అధికారాన్ని చేపట్టారు. 1973లో శశికళా కాకోద్కర్ గోవా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. 1980లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సయ్యద్ అన్వరా తైమూర్ అస్సాం ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 1988లో ఎంజీ రామచంద్రన్ భార్య జానకీ రామచంద్రన్ నెలరోజుల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. 1991లో మరియు 2001 నుండి 2006 వరకు జయలలిత రెండు సార్టు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా మూడోసారి ఆమె ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించబోతున్నారు. 1995లో బీఎస్పీ నేత మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పదవి చేపట్టారు. బీహార్‌లో రబ్రీదేవి మూడు సార్టు ముఖ్యమంత్రి పీఠాన్ని...