పోస్ట్‌లు

nagam janardhan reddy tdp chandrababu naidu kcr telangana telangana separate chidambaram soniagandhi manmohan singh jai hind jai telangana hot news లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జై హింద్‌.. జై తెలంగాణ‌

చిత్రం
తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను వెన్నాడుతూనే ఉన్నారు.స్పీకర్ దాదాపు ఇరవై రోజులు రాష్ట్రంలో అందుబాటులో లేకుండా విదేశీపర్యట నలో ఉన్నారు. ఆ సమయంలో నాగం ఒక రోజున స్పీకర్ మిస్సింగ్ అంటూ హడావుడి చేశారు.స్పీకర్ శాసనసభ కార్యాలయానికి జెండా ఆవిష్కరణ నిమిత్తం రాగానే నాగం జనార్ధనరెడ్డి ఆయనను కలిసి తన రాజీనామా సంగతి ఏమి చేశారని ప్రశ్నించారు.జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండాను కూడా పట్టుకుని నాగం అసెంబ్లీకి రావడం విశేషం. నాగం ఈ సందర్భంగా జై తెలంగాణ నినాదాలు కూడా చేశారు. కాగా నాగం జనార్ధనరెడ్డి రాజీనామాపై రేపు చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు.ఈ మాటను బట్టి రేపు నాగం జనార్దనరెడ్డి పట్టుబడితే రాజీనామాను స్పీకర్ ఆమోదించవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు.ఆయనతోపాటు హరీశ్వర్ రెడ్డి,వేణుగోపాచాలాచారి,జోగు రామన్నలు కూడా తన రాజీనామాలను ఆమోదింప చేసుకోవచ్చేమో చూడాలి.