ఆత్మాహుతి దాడులకూ సిద్దం..
మంచి వక్తగా పేరొందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ ఇలా మాట్లాడారేమిటి? ఎంత ఆవేశం ఉన్నా ఇంత ఘోరంగా మాట్లాడడమేమిటి? సమైక్య రాష్ట్రం కోసం ఆత్మహత్యలకే కాదు, ఆత్మాహుతి దాడులకు కూడా సిద్దమని ఆయన ప్రకటించారు. ఆత్మహత్యల గురించి ప్రస్తావించడమే తప్పు.ఆపైన ఆత్మాహుతి దాడుల గురించి మాట్లాడడం మరీ తప్పు. ఎవరిపై ఆత్మాహుతి దాడి చేస్తారు. ముందుగా ఆయన ఒకదానికి సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ రెండువేల ఎనిమిదిలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినప్పడు ఈయన ఎవరిమీద ఎందుకు దాడి చేయలేదో చెప్పాలి. కనీసం తమ నాయకుడు చంద్రబాబు ను ప్రశ్నించనన్నా ప్రశ్నించారా అన్నది కూడా చెప్పాలి.ఆ తీర్మానంలో కనీసం తమ పార్టీ మౌలిక విధానం సమైక్య రాష్ట్రం అని మాట మాత్రం కూడా రాయని దానికి ఆయన ఎవరిపై దాడి చేశారో చెబితే బాగుంటుంది.పోని ఇప్పటికైనా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్య రాష్ట్రం కావాలంటారో, ప్రత్యేక రాష్ట్రం కావాలంటారో చెప్పమని కేశవ్ దాడిచేస్తారేమో తెలియదు.ఇంకోమాట కూడా అన్నారు. దేహం ముక్కలైనా ,రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని రాష్ట్రం విడిపోతే దేశం చీలిపోతుందని కేంద్రం గ...